నేను క్రైస్తవునిగా మారటం ఎలా?

మీరు మంచివారని మీరనుకోవచ్చు. చేతనైనంతమట్టుకు మంచిగా జీవించి మంచిపనులు చేసి వుండవచ్చు. మీ జీవితంలోని మంచి దానిలోని చెడుకంటే ఎక్కువగా ఉండి వుండవచ్చు. కానీ ఇదంతా చేసిన తరువాత కూడా ఇంకా ఏదో వెలితి, అసంతృప్తి, శూన్యత మరియు ఒంటరితనం ఉందని మీకనిపిస్తుందా?

వివరించలేని మీ అవసరతలను తీర్చుకోవటానికి మీరు బహుశా డ్రగ్స్, సెక్స్, మెటీరియలిజం, పార్టీలకు వెళ్ళటం లేదా ఏదో గ్రూపులో భాగంగా ఉండటం వంటి అనేక విషయాలు ప్రయత్నించి వుంటారు.

Baptism

కానీ మీ జీవితంలో ఇంకా ఏదో కోల్పోతున్నారా? ఆ శూన్యతను నింపగలిగిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే దేవుడు. మీ జీవితాన్ని సరిచేసుకోవటానికి అనేక పరిష్కారాలను మీరు ప్రయత్నించి వాటిలో ఏదీ పనిచేయకపోతే దేవుడే మీకు జవాబు.

దేవుడు మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైన ఒక మాన్యువల్ ఇచ్చారు. అదే బైబిల్. మన జీవితంలో సంతోషాన్ని, ఆశాజనకమైన జీవితాన్ని ఎలా అనుభవించాలో మనకు తెలియాల్సిన ముఖ్యమైన మరియు నిజమైన సూచనలు ఇచ్చే ఈ గ్రంథానికి ఆయనే రచయిత. మీరు ఎదుర్కొనే సమస్యలకు మరియు శూన్యతకు ఆయన దగ్గర జవాబు ఉంది.

మీరు ఒక ఉద్దేశం చేత జన్మించారు కాని అనుకోకుండా పుట్టినవారు కాదు. సృష్టి ఆరంభంలో పాపం చేయుట ద్వారా మానవుడు దేవుని నుండి దూరమయ్యాడు. కానీ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన భూమిపై నివసించి, శిక్షను అనుభవించి, మన పాపాల కొరకు వెలను చెల్లించటానికి సిలువలో చనిపోయారు. మూడు రోజుల తరువాత ఆయన మరణం నుండి లేచారు.

యేసు మిమ్మును ప్రేమించి మీతో సంబంధం కలిగి జీవించాలని ఆశిస్తున్నారు. కానీ పాపం మనలను ఆయన నుండి వేరు చేస్తుంది.

  • మీరు పాపి అని, దేవుని తీర్పుకు అర్హులని ఒప్పుకోండి

    ప్రతి ఒక్కరూ పాపంతోనే పుట్టారని, దేవుని నియమాలను ఉల్లంఘించారని మనం నమ్ముతాము (రోమా 3:23). దీని మూలంగా, మానవులు దేవుని నుండి దూరమై ఆయన తీర్పుకు లోనౌతారు. మంచి పనులు చేయటం వలన మనలను మనం రక్షించుకోలేము (రోమా 6:23).

  • యేసు మీకొరకు చనిపోయి తిరిగి లేచారని అర్థంచేసుకోండి

    మనం పాపం చేసి నరకమార్గంలో వెళ్తున్నప్పటికీ, దేవుడు తన కుమారుడైన యేసును పంపించారు. ఆయన పరిపూర్ణ దేవుడు మరియు పరిపూర్ణ మానవునిగా మన పాప శిక్షను అనుభవించటానికి సిలువలో చనిపోయారు. ఆయన మన పాపాల కోసం చెల్లించిన మూల్యాన్ని దేవుడు అంగీకరించారనటానికి ఋజువుగా మూడవరోజు యేసు చావును గెలిచి తిరిగి లేచారు (1 పేతురు 3:18; 1 కొరింథీ 15:5).

  • మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి క్రీస్తు మీకొరకు చనిపోయి తిరిగి లేచారని నమ్మండి

    యేసు చనిపోయి తిరిగి లేచారని తెలుసుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి రక్షణ పొందడు. యేసు దేవుని కుమారుడని దయ్యాలు కూడా నమ్ముతాయి కానీ అవి పరలోకానికి వెళ్ళవు (యాకోబు 2:14-25). రక్షణ పొందాలంటే, యదార్థంగా మీ పాపాన్ని విడిచిపెట్టి, క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపం మరియు మారుమనస్సు పొంది (అపొ. 26:20) క్రీస్తు మీ స్థానంలో సిలువలో చనిపోయి తిరిగి లేచారని నమ్మాలి (రోమా 10:9-10). మీరలా చేసినప్పుడు, పరలోకానికి వెళ్ళటానికి మీరు క్రీస్తుపై ఆధారపడి మీరు చేసే మంచి పనులపై ఆధారపడరు (తీతుకు 3:4-5).

రక్షణ అనేది మీయంతట మీరు అర్హతతో సంపాదించుకొనేది కాదు. అది అర్హతలేకున్నా దేవుడు ప్రేమతో మరియు దయతో వరముగా ఇచ్చే నిత్యజీవం

మీరు యేసు ద్వారా నిత్యజీవం అనే ఈ వరాన్ని పొందటానికి ఇష్టపడితే మరియు ఆయనను మీ స్వంత రక్షకునిగా మరియు ప్రభువుగా మీ హృదయంలోనికి ఆహ్వానించాలని నిజంగా ఆశిస్తే, ఈ క్రింది ప్రార్థన చేయండి:

“యేసు, నేను పాపినని నాకు తెలుసు. మీతో కలసి పరలోకంలో నిత్యము జీవించటానికి నా పాపాల కోసం మీరు సిలువలో చనిపోయి తిరిగిలేచారని నేను నమ్ముతున్నాను. నేను ఇష్టపూర్వకంగా నా పాపాల విషయమై పశ్చాత్తాపపడి నా హృదయంలోనికి మరియు జీవితంలోనికి రమ్మని మిమ్మును ఆహ్వానిస్తున్నాను. నా మాటలు, ఆలోచనలు మరియు క్రియలను మీ స్వాధీనంలో ఉంచుకొనండి. నా రక్షణ నిమిత్తం నా విశ్వాసమంతటిని మీపై ఉంచుతున్నాను. నా ప్రభువుగా మరియు రక్షకునిగా మిమ్మును మరియు మీరిచ్చే ఉచిత బహుమానమైన నిత్యజీవాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఆమెన్.”

మీరు ఈ ప్రార్థన చేసి క్రీస్తును స్వీకరిస్తే, మీతో కలసి సంతోషించటానికి మేము ఈ విషయం తెలుసుకోవాలని ఆశిస్తున్నాము! మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ప్రార్థనా అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి లేదా రాయండి. ప్రభువుతో మీ ప్రయాణంలో మేము మిమ్మును ప్రోత్సహించాలని ఆశిస్తున్నాం!